టాలీవుడ్ లో మరోసారి మోగనున్న సమ్మె సైరన్ ?

Wednesday, April 25th, 2018, 03:28:58 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు రోజుకో రీతిన మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయమై రెజినా వివాదం తీవ్రరూపం దాల్చింది. నిన్న మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ హీరోలు అన్నపూర్ణ స్టూడియో లో ఒక సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికపై అలానే మీడియాకు ఎలాంటి అడ్డుకట్ట వేయాలనే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొద్దిరోజుల క్రితం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు నిర్మాతల మండలికి మధ్య చార్జీల విషయమై విబేధాలు తలెత్తడంవల్ల కొద్దిరోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయబడ్డ విషయం తెలిసిందే. అలానే తమిళనాడులో కూడా సమ్మె ప్రభావం బాగానే చూపించింది.

టాలీవుడ్ లో ఈ అంశం త్వరగానే పరిష్కారం అయినప్పటికీ, తమిళ నాడు లో మాత్రం గత గురువారం పరిష్కరింపబడింది. కాగా ప్రస్తుతం మరొక విషయమై టాలీవుడ్ లో సమ్మె జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. లైట్ మెన్ లు నిర్మాతల మందలి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ సమ్మె జరగనున్నట్లు తెలుస్తోంది. ఓవర్ టైం, ఎక్స్ ట్రా డ్యూటీ కి సంబంధించి బెటాలు నిర్మాతలు సరిగా ఇవ్వడం లేదని లైట్ మెన్ ల సంఘం నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిందట .

ఈ విషయమై జరిగిన చర్చల్లో నిర్మాతలు లైట్ మెన్ లు కోరినట్లు 25 శాతం బెటాలు ఇవ్వలేము, కేవలం 12 శాతం అయితే ఇవ్వగలమని తేల్చి చెప్ప్పారట. అందువల్ల లైట్ మెన్ లు వెంటనే సమ్మె సైరెన్ మ్రోగించనున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై లైట్ మెన్లు గాని, నిర్మాతల సంఘం నుండి గాని ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ వారు సమ్మె కనుక చేపడితే షూటింగ్ లకు ఆటంకం కలిగే ప్రమాదం లేకపోలేదు…..

  •  
  •  
  •  
  •  

Comments