మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రంగస్థలం..!

Sunday, September 16th, 2018, 06:44:14 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరొయిన్ గా ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో విలక్షణమైన దర్శకుడు సుకుమార్ 1980వ దశకంలో ఉండే పల్లెటూరు నేపధ్యంలో తెరకెక్కిన అద్భుత చిత్రం “రంగస్థలం”. ఈ చిత్రం విడుదల అయ్యి ఎన్ని బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్ని కొన్ని ప్రదేశాల్లో బాహుబలి2 పేరిట ఉన్నరికారులను కూడా ఈ చిత్రం బద్దలు కొట్టేసేంది.దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఒక సరైన విజయం అందితే సిట్టిబాబు ప్రభంజనం ఎలా ఉంటుందో తెలియజేయడానికి.

అయితే ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన వీడియో పాటలను యూట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.ఈ చిత్రంలోని “రంగమ్మ మంగమ్మ” పాటకు మాత్రం ప్రేక్షక ఆదరణ మాత్రం వేరే అని చెప్పాలి.ఎందుకంటే ఈ పాటకి వచ్చిన వీక్షకుల సంఖ్యయే దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు ఈ పాటను యూట్యూబ్ లో దాదాపు 10 కోట్ల మంది వీక్షించారు. ఇంత తక్కువ సమయంలో ఇది ఒక రికార్డే అని చెప్పాలి. అంతే కాదు ఈ పాత యొక్క లిరికల్ వీడియోకి కూడా ఇదే స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొత్తానికి మన సిట్టిబాబు, రామలక్ష్మిల ఖాతాలో మరో రికార్డును వేసేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments