మరొక అద్భుత రికార్డ్ సొంతం చేసుకున్న బాహుబలి!

Friday, February 9th, 2018, 03:47:58 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజం బాహుబలి రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్రం తెలుగువాడి ఖ్యాతిని దేశ, విదేశాల్లో మళ్ళి మళ్ళి చెప్పుకునేలా చేసింది. సినిమా విడుదలకు ముందు నుంచి పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తరువాత కూడా ఎదో విషయంలో సరికొత్త రికార్డ్ ను అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతూ ముందుకు తీసుకెళుతోంది. భారత దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆ సినిమాకు బాలీవుడ్ సైతం తలవంచక తప్పలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎందులోనూ తక్కువ కాదు అని బాహుబలి నిరుపించింది. టాలీవుడ్ లో ఇకపై ఎవరైనా మాట్లాడాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పుకునే రీతిలో ఈ చిత్రాన్ని రూపొందిచారు రాజమౌళి. అయితే రీసెంట్ గా మరొక రికార్డును ఆ సినిమా అందుకుంది. డిజిటల్ మీడియా ప్రస్తుతం ప్రపంచంలో చాలా వేగవంతంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అయితే దానిలో భాగంగా ఇంటర్నెట్ లో సినిమా ప్రసారాల మాధ్యమం నెట్ ఫ్లిక్స్ కూడా వరల్డ్ లో చాలా పాపులర్ అవుతోంది. అయితే బాహుబలి 2 సినిమాను కొనుగోలు చేసి భారత్ లో అడుగుపెట్టిన నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 లో బాహుబలి ది బిగినింగ్ 2వ స్థానం లో నిలిచింది. ఎక్కువమంది వీక్షించిన చిత్రాలలో మొదటి స్థానంలో దంగల్ నిలవగా ఆ తరువాత డియర్ జిందగీ రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో బాహుబలి 2 ది కంక్లూజన్ నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో బాహుబలి కలెక్షన్స్ లో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ నెక్స్ట్ టాలీవుడ్ బడా సినిమాల డిజిటల్ రైట్స్ ని అందుకోవడానికి చూస్తోంది. ముఖ్యంగా మహేష్, ప్రభాస్, రాజమౌళి తదుపరి మల్టిస్టారర్ సినిమాలను కొనుగోలు చేసేదిశగా ఈ సంస్థ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది….