బిగ్ బ్రేకింగ్: మరొక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Wednesday, November 13th, 2019, 12:48:58 PM IST

రోజులు గడుస్తున్నా ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. పైగా హైకోర్టు లో తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా వుంది. అంతేకాని ఆర్టీసీ కార్మికుల విషయం లో తెరాస ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల నుండి ఆర్టీసీ లో డ్రైవర్ గా పనిచేస్తున్న ఆవుల నరేష్ ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

భార్య గత ఐదేళ్ల నుండి అనారోగ్యం తో బాధపడటం, నెలకు దాదాపు ఐదువేల రూపాయలు మందులకు ఖర్చు అవ్వడం, పిల్లల చదువులకు కూడా ఖర్చు అవ్వడం తో ఒకే సారి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. భార్య ఇద్దరు పిల్లలు కలిగిన నరేష్ ఆత్మహత్య చేసుకోవడం తో కార్మికులు, అఖిల పక్ష నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. మృత దేహం తో ర్యాలీ కి ప్రయత్నించగా పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. అక్కడే బస్ డిపో ఎదుట ధర్నా కి దిగి,మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.