బిగ్ బాస్ లో మరో సంచలనం – కంటెస్టెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Thursday, June 13th, 2019, 10:22:05 PM IST

తెలుగులో ప్రసారం అయినటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పటివరకు ప్రసరమైనటువంటి రెండు సీజన్ లలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ కార్యక్రమం. కాగా ఈ కార్యక్రమం ప్రస్తుతానికి 3 సీజన్ ప్రసారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ కార్యక్రమంలో మూడవ సీజన్ ఇంకా మొదలవక ముందే ఎన్నో సంచలనాలకు దారి తీస్తుంది. ఈ షూ మీద ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి… దీనికి హోస్ట్ ఎవ‌రు అని ఓ సారి వార్త‌లు వ‌స్తే.. కంటెస్టెంట్స్ ఎవరు అనే వార్తలు కూడా బాగానే వచ్చాయి… అయితే ఈ షో కి సంబందించిన మరొక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈసారి ఈ సీజన్ లో ఒక రాజకీయ నాయకురాలు అడుగు పెట్టనుందని సమాచారం. తాను రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో హీరోయిన్ కూడా. అందుకనే తనకు అవకాశం ఇచ్చారని వార్త ప్రచారంలో ఉంది. కాగా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన హీరోయిన్ మాధవీలతా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. రాజకీయాలు తనకు కలసిరాకపోవడంతో మల్లి తన కెరీర్ పై దృష్టిపెడుతుందని అంటున్నారు. కాగా ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది. అయితే ఒకవేళ నిజంగానే ఈ బీజేపీ నేత గనక ఈ షోలో పాల్గొంటే ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.