బ్రేకింగ్: ఏపీ సర్కార్ మరొక కీలక నిర్ణయం..!

Tuesday, October 8th, 2019, 02:31:44 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

అయిఎతే వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతోత్సవాలు ప్రభుత్వం నిర్వహించనుంది. వాల్మీకి జయంతి కోసం రూ. 25లక్షల ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2017లోనే తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అయితే తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపట్ల బోయిలు కూడా తమ సంతోషాన్ని తెలియచేస్తున్నారు.