జనసేనకు మరో షాక్ – పార్టీ మారనున్న మరో నేత

Sunday, June 9th, 2019, 11:01:02 AM IST

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓటమినుండి ఇంకా కోలుకోనేలేదు… అప్పుడే జనసేన పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది… జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రావేలా కిషోర్ బాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు… తన వ్యక్తిగత కారణాల వలననే జనసేన పార్టీని వీడనున్నట్లు రావేలా తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాసి, వెంటనే తన రాజీనామాని ఆమోదించాలని లేఖలో కోరాడు… అయితే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా రావెల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా రావేలా అంతకు ముందు టీడీపీలో కొనసాగారు. ఇప్పుడు బీజేపీలోకి జంప్ అవ్వనున్నారు… అయితే రావేలా కిశోర్ బాబు నేడు ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రావేల తో పాటే పలు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా మోడీ సమక్షంలో బీజేపీలో చేరిపోనున్నారు…

నేడు మోడీ తిరుమల పర్యటన సందర్భంగా, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లోనే ప్రధానిని కలిసి అక్కడే మోడీ చేత కండువా కప్పుకోటానికి సిద్దమయ్యాడు రావేల. అయితే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్లాలని జనసేనాని పిలుపిచ్చిన రెండవరోజే రావెల కిషోర్ బాబు ఇలా పార్టీ మారడంతో ఆ పార్టీ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. కాగా రావెల కిషోర్‌ బాబు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడని జనసేన వర్గాలనుండి సమాచారం అందింది.