జగన్ నిర్ణయంతో అయోమయంలో పడ్డ చంద్రబాబు

Thursday, July 11th, 2019, 02:31:44 AM IST

ఏపీలో జగన్ తీసుకునే నిర్ణయాలతో అందరు కూడా షాక్ కి గురవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబుని టార్గెట్ చేసి జగన్ ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరం అనేది ఏపీకి పెద్ద వరం అనే చెప్పాలి. అందుకని ఎన్నికలకు ముందు అందరు కూడా పోలవరం అనే పాట పాడారు. అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ పోలవరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికోసం ఎన్నో ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. కానీ అనుకోని పరిణామాల వలన ఏపీలో టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు అకస్మాత్తుగా పోలవరం ప్రాజెక్టు ప్లాన్ కూడా మారిపోనుంది చెప్పాలి. అయితే ఇప్పటికే పోలవరం మీద భారీ అవినీతి జరిగిందని, దానిమీద సరైన నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక కమిటీని కూడా నియమించారు.

కాగా గత ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ నుంచి 4000 కోట్ల విలువైన కీలక పనులను నవయుగ సంస్థకు అప్ప చెప్పింది. అందుకనే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతొ అనవసరమైన టెండర్లు పాడుతూ చాలా అవినీతికి పాల్పడిందని జగన్ ప్రభుత్వం అంటున్నారు. ఈమేరకు పోలవరం పై అప్పటి టెండర్లను రద్దు చేసి త్వరలోనే రీ టెండరింగ్ కు వెళ్ళాలని జగన్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశాడు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంది మాత్రం కేవలం చంద్రబాబు మీద కక్షతోనే అని, అవినీతి ఆరోపణల కారణంగా చంద్రబాబు మీద కక్ష సాధించడానికి అని పలువురు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా ప్రజల సమస్యలకంటే చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.