ఆర్టీసీ సమ్మె ఎపెక్ట్.. సీఎం కేసీఆర్‌కి మరో షాక్..!

Tuesday, October 15th, 2019, 09:53:17 PM IST

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తారాస్థాయికి చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమెను మరింత ఉదృత్తం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు కూడా మద్ధతు తెలుపుతున్నాయి. అయితే తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌జీవో కూడా తమ మద్ధతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్ధతు తెలపడంతో సీఎం కేసీఆర్‌కి మరో షాక్ తగిలినట్టయింది.