టీడీపీకి మరొక షాక్ – బీజేపీలో చేరడానికి సిద్దమైన మరొక నేత

Wednesday, August 14th, 2019, 01:07:23 AM IST

ఏపీలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి చాలా గడ్డు కాలం నడుస్తుందని చెప్పాలి. అధికారాన్ని కోల్పోయామని బాధనుండి తేరుకునేలోపే చాలామంది నేతలు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి చేరిపోయారు. అయితే అందరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. కాగా మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాని తొందర్లోనే సాధిస్తామని ఇటీవలే ఒక బీజేపీ నేత అధికారికంగానే ప్రకటించారు. కాగా తాజాగా మరొక టీడీపీ మహిళా నాయకురాలు తన టీడీపీ పార్టీని వదిలేసి, బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని తానె చెప్పుకుంటున్నారు.

తానెవరో కాదు టీడీపీ మహిళా నాయకురాలు రేవతి చౌదరి. కాగా త్వరలోనే బీజేపీలో చేరతానని సినీ నటి, టీడీపీ నేత రేవతి చౌదరి తెలిపారు. కాగా మంగళవారం నాడు కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని కలిసిన తరువాటా, అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తానూ మరికొద్ది రోజుల్లోనే బీజేపీలోకి చేరుతున్నట్లు రేవతి చౌదరి ప్రకటించారు. కాగా రేవతి చౌదరి ఇటీవల జరిగిన ఎన్నికలకంటే ముందే టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించి ఆమెకి అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు.