షాకింగ్ : ఢిల్లీ సీఎం కు ఇంకా ప్రమాదం ఉందా..బుల్లెట్లతో దొరికిన వ్యక్తి.!

Tuesday, November 27th, 2018, 03:19:45 PM IST

భారతదేశ రాజధాని ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ మీద గత కొద్ది రోజుల అనీల్ అనే ఒక గుర్తు తెలీని వ్యక్తి ఏకంగా కేజ్రీ వాల్ యొక్క సచివాలయంలోకే వచ్చి ఆయన భోజన సమయంలో కారం పొడితో దాడి చెయ్యడం కలకలాన్ని రేపింది. అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా సరే అతను ఎలా అక్కడి వరకు రాగలిగాడానికి కేజ్రీ వాల్ కు ఎదో ప్రమాదం పొంచి ఉంది అని అనేక అనుమానాలు వచ్చాయి. అంతే కాకుండా రాజధాని సీఎం కే భద్రత లేనప్పుడు ఇక సామాన్య జనం పరిస్థితి ఏమిటి అని అక్కడి ప్రజలు కూడా ప్రశ్నించారు.

అంతలోనే ఆ ఘటన మర్చిపోయే లోపే మరో షాకింగ్ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. జీతాలు పెంచాలి అంటూ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మత బోధకులతో ఉన్న ఇమ్రాన్ అనే వ్యక్తి యొక్క ప్రవర్తనా తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా అతని దగ్గర బుల్లెట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. ఈ విషయం మీదనే పోలీసులు ఆరా తియ్యగా అక్కడి ప్రార్ధనా మందిరంలోని విరాళాల పెట్టెలో తనకి ఈ బుల్లెట్లు దొరికాయని వాటిని పర్స్ లో పెట్టుకొని మర్చిపోయాయని ఇమ్రాన్ తెలిపాడు. కేజ్రీ వాల్ మీద వారం తిరగక ముందే మరో సారి ఈ సంచలన సంఘటన జరగడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయని పోలీసులు తెలిపారు.