సూర్య ఫ్యామిలీ నుండి మరో స్టార్

Saturday, April 28th, 2018, 02:53:46 PM IST

త‌మిళంతో పాటు తెలుగులోను ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న న‌టుడు సూర్య‌. విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్న సూర్య.. న‌టుడు శివ కుమార్ సుపుత్రుడు అన్న సంగ‌తి తెలిసిందే. సూర్య సోద‌రుడు కార్తీ, భార్య జ్యోతిక కూడా ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కి బాగా సుప‌రిచితం. ఇప్ప‌టికే వీరి ఫ్యామిలీ నుండి వ‌చ్చిన న‌లుగురు స‌భ్యులు ఇండ‌స్ట్రీలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొని రాణిస్తుంటే, ఇప్పుడు సూర్య సోద‌రి బృందా సింగ‌ర్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. సీనియర్‌ తమిళ నటుడు కార్తీక్, తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటిస్తోన్న ‘మిస్టర్‌ చంద్రమౌళి’ సినిమా ద్వారా బృంద గాయనిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకి శ్యామ్‌.సి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఇటీవల జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బృందా మాట్లాడుతూ ..మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌న్ను డెబ్యూ సింగ‌ర్‌గా భావించ‌లేదు. నేను కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండే ఛాన్స్ ఇచ్చారు. పాట మంచిగా వ‌స్తేనే సినిమాలో పెట్ట‌మ‌ని కోరాను. నేను బాగా పాడుతాన‌ని ఫ‌స్ట్ నుండి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు శ్యామ్‌. ఆయ‌న‌కి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని ఆమె పేర్కొన్నారు. మ‌రి రానున్న రోజుల‌లో బృందా త‌న టాలెంట్‌తో ఎంత‌గా ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments