బాబోయ్ .. మరో శృంగార తార కూడా వస్తోంది ?

Tuesday, October 31st, 2017, 04:34:38 PM IST

ఇప్పటికే బాలీవుడ్ లోకి శృంగార తారగా ఎంట్రీ ఇచ్సినా సన్నీ లియోన్ అంటే ఇప్పటికి ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలిసిందే. సన్నీని తమ సినిమాల్లో నటింప చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా మరో శృంగార తార ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎవరో కాదు .. మాజీ శృంగార తార మియా ఖలీఫా !! హాలీవుడ్ లో శృంగార తార గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ త్వరలోనే ఓ మలయాళ సినిమాలో నటిస్తుందట !! ఇప్పటికే దానికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళంలో వచ్చిన చంక్జ్ సినిమా సీక్వెల్ లో ఆమె నటిస్తుందట. ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులూ ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసాడు. ఈ చిత్రంలో ఖలీఫా కీలక పాత్రలో నటిస్తుందట. వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెడతారట. అన్నట్టు ఈ సినిమాలో ఖలీఫా ఓ స్పెషల్ ఐటెం సాంగ్ కూడా చేస్తుందట !! మరి ఈ శృంగార భామ ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి !!