వైసీపీలోకి చేరేందుకు మాజీ ఎమ్మెల్యే డేట్ ఫిక్స్.. టీడీపీకి మరో షాక్..!

Thursday, October 10th, 2019, 05:13:15 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ పాలన నచ్చిన ప్రత్యర్ధి పార్టీ నాయకులు కూడా చాలా మంది వైసీపీలో చేరిపోతున్నారు.

అయితే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికలలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వలస వెళ్ళిన జ్యోతుల నెహ్రూ ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నారు. తిరిగి వైసీపీలోకి రావాలని డిసైడ్ అయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే మొన్నటికి మొన్న జూపూడి కూడా తన తప్పు తెలుసుకుని టీడీపీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీలో చేరిపోయారు. అయితే ఇక టీడీపీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమని భావిస్తున్న జ్యోతుల నెహ్రూ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో అసలు నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.