బ్రేకింగ్: టీడీపీలో మరో వికెట్ డౌన్.. షాక్‌లో చంద్రబాబు..!

Saturday, August 24th, 2019, 12:31:34 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీనీ వీడి మరో నేత బీజేపీలో చేరిపోయారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న సైకం జయచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. నేడు బీజేపీ జాతీయ నేత రామ్‌మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో ఈయన బీజేపీ కండువా కప్పుకున్నారు.