బాబుకి బిగ్ షాక్: టీడీపీనీ వీడి వైసీపీలో చేరిన కీలక నేత..!

Tuesday, August 20th, 2019, 06:31:07 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీడీపీనీ వీడి మరో కీలక నేత వైసీపీలో చేరిపోయారు. టీడీపీ సీనియర్ నేత కురెళ్ళ రాం ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి నాని సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన కురెళ్ళ రాం ప్రసాద్ వైసీపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు నానిగారితో కలిసి పనిచేస్తానని చెప్పారు. అయితే ఉప ముఖ్యమంత్రి నాని మాట్లాడుతూ కురెళ్ళ రాం ప్రసాద్ పార్టీలో చేరడం సంతోషించదగ్గ విషయమని, వైసీపీ ప్రభుత్వం పేదలకు అందించే పథకాలను చూసే అన్ని పార్టీల నేతలు వైసీపీలో చేరడానికి సిద్దమైతున్నారని భవిష్యత్తులో పార్టీనీ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను వైసీపీ ఎన్నటికి మరిచిపోదని అన్నారు.