టీడీపీలో మరో వికెట్ డౌన్.. బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్న కీలక నేత..!

Wednesday, July 17th, 2019, 06:20:05 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే వలసలు ఆపడానికి టీడీపీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న రోజుకొక నేత పార్టీ మారుతూ టీడీపీకి అన్యాయం చేస్తున్నారు. అయితె తాజాగా మరో సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ రావు పార్టీనీ వీడి బీజేపీలో చేరడానికి ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నాడట. అయితే దళిత నేత కావడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో మంచి వాగ్దాటిగా ఈయనకు పేరు ఉండడంతో బీజేపీ కూడా ఈయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈయన 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి వైసీపీ అభ్యర్థిగా కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి వచ్చే ఎన్నికలలో బీజేపీ తరుపున పోటీ చేయాలని భావిస్తున్నారట.