వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ మంత్రి.. చంద్రబాబుకు డబుల్ షాక్..!

Monday, October 21st, 2019, 04:31:30 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పరిస్థితి మరింత కుదేలయ్యింది. ఇక పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీలోని సీనియర్ నేతలంతా వైసీపీ, బీజేపీలోకి చేరిపోయారు. అయితే దెబ్బ మీద దెబ్బ తగిలిన టీడీపీకి ఈ సారి డబుల్ షాక్ తగలబోతుంది. గత కొంత కాలంగా బీజేపీలో చేరేందుకు రెడీ అయిన ఏపీ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి నేడు ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలో చేరి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఆయన ఓటమిపాలవ్వడం, టీడీపీ కూడా ఓటమిపాలవ్వడంతో తిరిగి వైసీపీలోకి వెళ్ళలేక బీజేపీలో చేరిపోయారు.

అయితే తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో సీఎం జగన్‌ను కలిసిన రామసుబ్బారెడ్డి ఆయనతో సన్నిహితంగా కొద్దిసేపు మాట్లాడారు. అయితే పార్టీలో ఉన్న తనను కాదని చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కాస్త అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డి పార్టీ మారి టీడీపీకి షాక్ ఇస్తారా అనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలలో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరగా, రామసుబ్బా రెడ్డి వైసీపీలో చేరితే కనుక జిల్లాలో చంద్రబాబుకు డబుల్ షాక్ తప్పదనే చెప్పాలి.