బిగ్ న్యూస్ : తెలంగాణాలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.!

Wednesday, July 29th, 2020, 09:47:38 AM IST

ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. దీనితో సామాన్య జనంతో పాటుగా ప్రజా ప్రతినిధులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపీ లో కరోనా పాజిటివ్ వచ్చిన నేతలు అంతా అక్కడి వైద్యం వద్దని హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణా రాష్ట్ర నేతలు కూడా కరోనా మూలాన గట్టి దెబ్బ తింటున్నారు.

ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు మరియు ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పుడు తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. నిజామాబాద్ ఆర్ముర్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వాచినట్టు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే నిజామాబాద్ లో భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో అసలు అక్కడ ఏం జరుగుతుంది అని నెటిజన్స్ అంటున్నారు.