బిగ్ బ్రేకింగ్ : ఒక్క ఏపీలోనే మరోసారి రికార్డు స్థాయి కరోనా కేసులు..ఓవరాల్ లెక్కలు ఇవే.!

Sunday, July 5th, 2020, 02:34:40 PM IST

మొత్తం మన దేశాన్నే ఇప్పుడు కరోనా కుదిపేస్తుంది. గత మూడు నెలల కితం మన దేశంలోకి ఎంటర్ అయిన ఈ ప్రమాదకారి వైరస్ అంతకంతకు మనదేశంలో భారీ ఎత్తున వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు చేసే కొద్దీ మరింత తీవ్ర స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి.

ఇప్పుడు తాజాగా ఏపీలో నమోదు కాబడిన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వారు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 20 వేల 567 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో ఒక్క ఏపీలోనే భారీ ఎత్తున 961 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇతర దేశాలు మరియు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్యతో కలిపి ఒక్క రోజుకు 2 తక్కువ 1000 కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.

దీనితో ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 16 వేల 102 కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో మొత్తం 391 మంది డిశ్చార్జ్ కాగా ఈసారి ఏకంగా 14 మంది మరణించడం బాధాకరం. ఒక్కరోజులో ఇన్ని కేసులు మరియు మరణాలు సంభవించడం బహుశా ఏపీలో ఇదే మొదటి సారి కావచ్చు.