బిగ్ బ్రేకింగ్ : మరోసారి ఏపీలో రికార్డు కరోనా కేసులు నమోదు.!

Thursday, June 4th, 2020, 12:27:27 PM IST

ఏపీలో కరోనా స్థాయి మరోసారి విజృంభించింది. గత రెండు వారాల నుంచి ఊహించని రీతిలో పెరిగిపోతుంది. గత రెండు నెలలో ఎన్నడూ లేని విధంగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 100 కు దగ్గరగా కేసులు రెండు సార్లు నమోదు కాబడిన సందర్భాలు ఉండగా ఇప్పుడు మూడోసారి అలాంటి ఘటనే నమోదు అయ్యింది.

గత 24 గంటల్లో నమోదు కాబడిన సమాచారాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. మొత్తం 9 వేల 986 శాంపిల్స్ ను పరీక్షించగా భారీగా 98 కేసులు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించారు. దీనితో మరోసారి ఏపీలో భారీ ఎత్తున కేసులు నమోదు అయ్యాయి. ఈ దెబ్బకు మొత్తం కేసుల సంఖ్య 3,377 కు ఎగబాకింది. అలాగే గడిచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. మరి ఏపీలో పరిస్థితులు ఎప్పుడు సర్దుమణుగుతాయో చూడాలి.