బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయి కేసులు.!

Sunday, June 28th, 2020, 09:18:41 PM IST


ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలలో కరోనా విషయంలో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణా రాష్ట్రమే అని చెప్పాలి. కేవలం తక్కువ టెస్టులు చెయ్యడంలో మాత్రమే కాకుండా ఎక్కువగా కేసులు నమోదు అవ్వడం దానికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రధాన కారణం కావడం వంటివి కీలకంగా మారాయి.

అలా ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు గత 24 గంటల్లో నమోదు కాబడిన కేసుల వివరాలను వెల్లడించారు. మొత్తం 3 వేల 227 శాంపిల్స్ ను పరీక్షించగా కేసులు భారీగా 983 కేసులు నమోదు అయ్యినట్టుగా తెలంగాణా రాష్ట్ర వైద్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

వీటిలో ఏకంగా కేసులు ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 816 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లోనే నలుగురు మరణించినట్టుగా నిర్ధారించారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి.