షాక్ .. పవన్ సినిమాకు మరో కొత్త టైటిల్ ?

Thursday, October 26th, 2017, 12:30:53 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25 వ సినిమా టైటిల్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయ్. సినిమా మొదలై చాలా రోజులు గడుస్తున్నా కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అసలే త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే కాస్త అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దానికి తోడు బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టడంతో ఈ సినిమా పై అటు ప్రేక్షకుల ఆసక్తి తో పాటు ఫాన్స్ ఆసక్తి బాగా పెరిగింది. నవంబర్ 7న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే అజ్ఞాతవాసి అని టైటిల్ తెగ ప్రచారంలో ఉంది..ఆ టైటిల్ ని ఖరారు చేస్తారని అందరు అనుకున్నారు .. కానీ ఇప్పుడు మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఓ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి .. ఇంతకి ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. ”బాటసారి” !! అవును ఈ టైటిల్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కథ ప్రకారం బాటసారి అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడితో పాటు యూనిట్ భావిస్తుంది. మరి ఈ టైటిల్ అయినా కన్ఫర్మ్ చేసి త్వరగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా లేదా అన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది.