50 రోజుల తర్వాత వచ్చిన డేరా భార్య.. ఎందుకు?

Tuesday, October 17th, 2017, 04:43:29 PM IST

ఒక్కసారిగా దేశంలో సంచలనం సృష్టించిన డేరా బాబా వివాదం గడిచి దాదాపు రెండు నెలలు కావోస్తున్నా ఇంకా ఆ విషయం గురించి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. నేరం రుజువయ్యాక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. అయితే శిక్ష విధించిన ఆ తర్వాత డేరా అసలు విషయాలు చాలా వరకు బయటపడ్డాయి. నేరాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటి వరకు డేరా బాబాను దైవంలా కొలిచిన జనాలు కూడా ఇప్పుడు అతని పేరెత్తడానికి కూడా ఇష్టపడటం లేదు.

అయితే ఎవరు ఊహించని విధంగా శిక్ష ప‌డిన 50 రోజుల త‌ర్వాత బాబా గుర్మీత్ సింగ్ రామ్ ర‌హీమ్‌ను చూడ‌టానికి అత‌ని భార్య హ‌ర్జీత్ కౌర్ జైలు కి వెళ్లింది. ఆమెతో పాటు కుమారుడు జ‌స్మీత్ ఇన్సాన్‌ అలాగే కోడ‌లు హుస‌న్‌ప్రీత్ ఇన్సాన్‌, కూతురు చ‌ర‌ణ్ ప్రీత్‌, అల్లుడు రుహ్‌-ఏ-మీత్‌ లు కూడా వెళ్లారు. అయితే శిక్ష పడి 50 రోజుల రోజుల తర్వాత వీరి రావడం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే డేరా ఇంతకుముందు తనను చూడ‌టానికి వ‌చ్చే వారిలో పది మంది పేర్ల‌ను జైలు అధికారుల‌కు ఇచ్చాడు. అప్పుడు అందులో భార్య పేరు లేదు..కానీ ఇప్పుడు ఆమె రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.