యాక్సిడెంట్ చేసింది నాని డ్రైవర్ కాదట ?

Monday, January 29th, 2018, 04:06:43 PM IST

గత శుక్రవారం టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైన సంగతి అందరికి తెలిసిందే. కేవలం డ్రైవర్ ఒక్కడే అందులో ఉండగా కారు ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో శుక్రవారం తెల్లవారుజామున కారును వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 3/పీపీడీఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా నాని అప్పుడే వివరణ ఇచ్చాడు. మొదట కారులో అయితే డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న మరొక వార్త కొత్త అనుమానాలను రేపుతోంది. కారు నడిపింది నానినే అని కొత్త తరహా ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తరువాత నాని అతని తండ్రి వెళ్ళిపోయి డ్రైవర్ కు జరిగిందంతా వివరించి వెళ్లారని అనుమానాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియరాలేదు.