బ్రేకింగ్: తెలంగాణలో మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్..!

Wednesday, March 25th, 2020, 11:40:39 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గు ముఖం మాత్రం కనిపించడంలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 41 కి చేరుకుంది. అయితే ఈ రోజు నమోదైన కేసులలో మూడేళ్ళ బాలుడు ఉండడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇటీవల ఆ పిల్లాడు సౌదీ నుంచి వచ్చాడని తెలుస్తుంది. ఇకపోతే ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.