ఫ్లాష్ న్యూస్: ఏపీ లో మరో రెండు కరోనా కేసులు!

Wednesday, March 25th, 2020, 10:56:32 PM IST

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో వాషింగ్టన్‌ నుంచి వచ్చిన యువకుడికి, గుంటూరులో 52 ఏళ్ల వ్యక్తికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలిందన్నారు.తాజాగా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వీరితో కలపగ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 10 కి చేరింది.