తెలంగాణలో కొత్తగా మరో రెండు టోల్‌ప్లాజాలు.. ఎక్కడెక్కడంటే..!

Wednesday, July 1st, 2020, 02:35:15 AM IST


తెలంగాణలో కొత్తగా మరో రెండు టోల్‌ప్లాజాలు రాబోతున్నాయి. అయితే కొత్తగా నిర్మించబోతున్న ఈ టోల్‌ప్లాజాలు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై స్టేషన్ ఘన్‌పూర్ వద్ద జరుగుతుండగా, మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు.

అయితే స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఆరు నుంచి ఎనిమిది గేట్లతో టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్ ప్లాజాల నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే ఈ రెండింటితో కలిపి ఆ సంఖ్య 20కి చేరింది.