టీడీపీనీ వీడనున్న మరో ఇద్దరు కీలక నేతలు.. దెబ్బ మీద దెబ్బ..!

Thursday, November 21st, 2019, 07:58:36 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పరిస్థితి మరింత కుదేలయ్యింది. ఇక పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీలోని సీనియర్ నేతలంతా వైసీపీ, బీజేపీలోకి చేరిపోయారు. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ తిరిగి అధికారం చేపట్టడం కాస్త కష్టమే అనుకున్న నేతలెవరూ టీడీపీలో ఉండేందుకు సాహాసం చేయడంలేదు. అయితే తాజాగా కృష్ణా జిల్లా నుంచి మొన్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలో వైసీపీలో చేరుతుండగా, దేవినేని అవినాష్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.

అయితే ఇది మరవకముందే కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. జిల్లాకు చెందిన మరో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ళ శోభన్, టీడీపీ అర్భన్ ఉపాధ్యక్షులు కిషోర్‌లు టీడీపీకి రాజీనామ చేస్తున్నట్టు ఇదివరకే లేఖలు కూడా పంపారు. అయితే త్వరలోనే వీరు కూడా వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని జిల్లా రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.