మరో రెండు కథలు కూడా కాపీ.. టీ సిరీస్ నోటీసులు?

Wednesday, January 10th, 2018, 09:26:30 PM IST

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా కొన్ని కథలు కాపీ అవుతున్నాయని బాలీవుడ్ మీడియాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ ఆధారంగా తెరకెక్కిందని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆ చిత్ర దర్శకుడు కూడా సినిమాను చూసి. అజ్ఞాతవాసి కూడా ఆ సినిమాలనే ఉందని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతానికి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుందో ఎవరు ఊహించలేకపొతున్నారు.

అయితే మరో రెండు కథలు కూడా టాలీవుడ్ లో కాపీ అయ్యాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా టీ సిరీస్ అజ్ఞాతవాసి టీజర్ రిలీజ్ అవ్వగానే నిర్మాతలకు నోటీసులు పంపిందని ఆ తరువాత ఒక ఒప్పందం కుదుర్చుకొని సినిమాను రిలీజ్ చేసుకున్నారనే టాక్ కూడా ఉంది. అదే తరహాలో ఇప్పుడు మరో రెండు కథలు కూడా కాపీ అని ఆ నిర్మాతలకు టీ సిరీస్ నోటీసులు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఫిల్మ్ నగర్ లో కూడా టాక్ వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కానున్నాయని కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది నిజమో కాదా అనే విషయం తెలియాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.