ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ టీమ్ సర్ప్రైజ్..?

Tuesday, April 20th, 2021, 05:42:22 PM IST

adi-purush-Prabhas

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం లో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం లో రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత పాత్ర లో ప్రభాస్ కి జోడీ గా కృతి సనన్ నటిస్తున్నారు. అయితే శ్రీరామ నవమి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా కి సంబందించి ఏప్రిల్ 21 వ తేదీన ఉదయం 07:11 గంటలకు ఒక ఆసక్తికర అప్డేట్ ను అందించనుంది. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రామాయణం కథాంశం గా పాన్ ఇండియా తరహాలో దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 3 డి వెర్షన్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం తో పాటుగా ప్రభాస్ రాధే శ్యామ్ మరియు సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ విడుదల కి సిద్దం అవుతుండగా, సలార్ మరోపక్క చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అంతేకాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ లో సైన్స్ ఫిక్షన్ కథలో ప్రభాస్ హీరో గా మరొక సినిమా తెరకెక్కనుంది. అయితే ఇందుకు సంబంధించిన తాజాగా అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.