అంతా కొత్తవారితో టాలీవుడ్ లో మరొక వైవిధ్య చిత్రం ప్రారంభం!

Friday, May 11th, 2018, 07:01:27 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతవరకు చిన్న చిత్రాల హవా కూడా నడుస్తోంది. మంచి ఆకట్టుకునే కథ, కథనాలుంటే ప్రేక్షకులు చిన్నా, పెద్ద అని తేడాలేకుండా బ్రహ్మరధం పడతారు. ఫిదా, చలో, అర్జున్ రెడ్డి వంటివి చిన్న చిత్రాలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సరికొత్త బ్యానర్ ‘అవర్ డ్రీమ్ సినిమాస్’ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా, ఆర్.కే.లింగాల నిర్మాతగా, ప్రణీత్ గౌతమ్ నంద అద్భుతమైన ఫొటోగ్రఫీతో,

సి.వర్షిత్ మరియు ఎస్ ఎస్ చారి సంయుక్తంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం నిన్న ఆ చిత్ర యూనిట్ సభ్యులు అలానే, కొందరు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తొలిషాట్ కి దర్శకుల్లో ఒకరైన ఎస్ ఎస్ చారి మరియు చిన్నారి తనయ్ క్లాప్ నివ్వగా, ఫోటోగ్రఫీ అందిస్తున్న ప్రణీత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్ర కథను తయారు చేయడం జరిగిందని చిత్ర నిర్మాత మరియు దర్శకులు చెపుతున్నారు. ఈ చిత్రంతో ఇద్దరు హీరోలు, మరియు నాలుగు హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

కాగా కొందరు టాలీవుడ్ సీనియర్ నటులు కూడా చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, నటీనటుల సెలెక్షన్ పూర్తి అయిందని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుందని, రేపు చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు నూతన దర్శకులు సి.వర్షిత్ మరియు ఎస్ ఎస్ చారి అంటున్నారు…….

Comments