పవన్ రెండు చోట్లా అందుకే పోటీ చేసారు..వైసీపీ నేత సంచలన కామెంట్స్.!

Sunday, June 28th, 2020, 10:21:58 PM IST

ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వై ఎస్ ఆర్ కాపు నేస్తం పథకం కింద ఆ వర్గానికి చెందిన వారికి ఆర్ధిక సాయం అందించే విధంగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ నిధులు విషయంలో సరైన క్లారిటీ లేదని అందుకు గాను శ్వేత పత్రం రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చెయ్యగా ..

ఎప్పటిలానే సంబంధిత శాఖకు చెందిన వారు కాకుండా ఇతరులు పవన్ ను తిట్టేందుకు ప్రెస్ మీట్ లు పెట్టారు. దీనితో శ్వేత పత్రం కోసం ఎక్కడా మాట్లాడకుండా అనవసరమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారని రివర్స్ కౌంటర్ వేశారు. అయినప్పటికీ పవన్ పై వైసీపీ నేతలు కులపరమైన విమర్శలు వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గించలేదు.

అదే విధంగా ఇప్పుడు మరో వైసీపీ నేత తోట త్రిమూర్తులు పవన్ పై సంచలన కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ తన సామాజికవర్గం ఎక్కువ ఉందనే భీమవరం మరియు గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసారని అయినప్పటికీ అతని సామాజికవర్గం వారే అతన్ని ఓడించారని ఇప్పటికైనా తనలోని లోపాలను సరిదిద్దుకోవాలని సంచలన కామెంట్స్ చేసారు.