జగన్ క్రేజ్ మాములుగా లేదు…అన్షుల్ సాక్సన్ మళ్ళీ స్పందించాడు.

Friday, November 22nd, 2019, 04:05:09 PM IST

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పొరబాట్లో లేకపోతే మరేమో తెలీదు కానీ, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఒక్క చిన్న కార్యక్రమం జరిగిన అది వైరల్ అవుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి పక్షాలకు వేరే పనిలేకుండా పోయింది. జగన్ చేస్తున్న తప్పులే పెద్దవిగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జాతీయ జెండాని అవమానించింది. అబ్దుల్ కలామ్ అవార్డుల్ని వైయస్సార్ పేరిట మార్చి, తనకు తెలీదని అనడం తో వివాదం సద్దుమణిగింది. అయితే ఇపుడు తాజాగా వైరల్ అవుతున్న ఫోటో ఫై నెటిజన్లు తారాస్థాయిలో మండిపడుతున్నారు.

గాంధీ విగ్రహం కలిగిన దిమ్మెకు వైసీపీ పార్టీ రంగులు వేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్షుల్ సాక్సన్ లాంటి బాధ్యత గల యువకుల దృష్టిలో వైసీపీ పడింది. దేశ భద్రత, రాజకీయ వ్యవహారాలలో అన్షుల్ స్పందన డిఫరెంట్ అని చెప్పొచ్చు. గాంధీ విగ్రహం కలిగిన దిమ్మకు వైసీపీ రంగులు వేయడం తో అన్షుల్ స్పందించారు. గాంధీ కాస్త వైయస్సార్సిపి గాంధీ అయిందని సోషల్ మీడియాలో తెలిపారు. నేనిపుడు వారిని విమర్శించను, ఒకవేళ విమర్శిస్తే నన్ను కూడా వైయస్సార్సిపి సాక్సన్ చేస్తారు అని ఎద్దేవా చేసారు. జాతీయ జెండా విషయంలో స్పందించినపుడు ఆంధ్ర ప్రదేశ్ ని వైయస్సార్ ప్రదేశ్ గా మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది. మరి ఈ విషయం లో జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.