అంతరిక్షంలో అద్భుతాలున్నాయంటున్న వరుణ్ తేజ్ ?

Monday, October 1st, 2018, 10:45:26 PM IST


మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ మొదటి నుండి భిన్నమైన సినిమాలు చేస్తూ తన క్రేజీ ని రోజు రోజుకు పెంచుకుంటున్నాడు. మెగా హీరోలంతా కమర్షియల్ దారిలో ఒకేవైపు వెళితే .. వరుణ్ మాత్రం నా రూటు సపరేటు అంటూ బిన్నంగా వెళ్లడమే అతనికి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. తాజాగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం సినిమాలో నటిస్తున్నాడు. ఘాజి లాంటి సంచలన చిత్రాన్ని తీసి మంచి పేరు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా చేస్తున్నాడు. తెలుగులో వస్తున్నా మొదటి అంతరిక్ష సినిమా ఇదే. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న సినిమా గురించి వరుణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సినిమాలో నటించడం అద్భుతమైన అనుభవమని, ఇది జీవితంలో ఎప్పటికి మరచిపోలేనని చెప్పాడు. ప్రేక్షకులకు కూడా ఇది అద్భుతాలను అందిస్తుందని చెప్పాడు. లావణ్య త్రిపాఠి, అథితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.