జూలై 6న యాంట్‌మేన్ త‌డాఖా

Friday, May 18th, 2018, 05:30:42 PM IST

ప్ర‌తిష్ఠాత్మ‌క మార్వ‌ల్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఇదివ‌ర‌కూ రిలీజైన బ్లాక్ పాంథ‌ర్, అవెంజ‌ర్స్ – ఇన్‌ఫినిటీ వార్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించాయి. ఆ కోవ‌లోనే తాజాగా రిలీజైన హాలీవుడ్ చిత్రం `డెడ్‌పూల్ 2` అసాధార‌ణ వ‌సూళ్ల‌తో హ‌వా సాగిస్తోంది. ఈ సినిమా డెడ్‌పూల్ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ రాకెట్ స్పీడ్‌తో వ‌సూళ్లు సాధిస్తోంద‌న్న రిపోర్ట్ అందింది.

త‌దుప‌రి ఆ స్థాయి హ‌వా సాగించే హాలీవుడ్ సినిమా ఏది? అన్న ప్ర‌శ్న‌కు ఆసక్తిక‌ర స‌మాధాన‌మిది. సూప‌ర్‌హీరో సిరీస్‌లో యాంట్ మేన్ గ‌త ఏడాది రిలీజై అద్భుత విజ‌యం సాధించింది. ఈ సినిమా సాధించిన వ‌సూళ్లు విశ్లేష‌కులే నోళ్లు వెల్ల‌బెట్టేలా చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ వ‌స్తోంది. తాజా సీక్వెల్‌కు `యాంట్‌మేన్ 2` అనే టైటిల్ నిర్ణ‌యిస్తార‌ని భావించినా ఆస‌క్తిక‌రంగా `యాంట్‌మేన్ అండ్ ది వాస్ప్‌` అంటూ కొత్త టైటిల్ పెట్టారు. యాంట్‌మేన్ సినిమాలో టైటిల్ పాత్ర‌ధారి పాల్ రుడ్‌తో పాటు, ఈవంగ‌లిన్ లిల్లీ పాత్ర‌కు అంతే ప్రాధాన్య‌త ఉండ‌డంతో ఈ టైటిల్‌ని నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ టైటిల్ ఆలోచ‌న‌ ద‌ర్శ‌కుడు ప్యాట‌న్ రీడ్ దేన‌ని తెలుస్తోంది. అభిమానుల కోరిక మేర‌కే ఇలా టైటిల్‌ని నిర్ణ‌యించార‌ని చెబుతున్నారు. బ్లాక్‌పాంథ‌ర్, అవెంజ‌ర్స్ 2 చిత్రాల్ని నిర్మించిన ప్ర‌తిష్ఠాత్మ‌క మార్వ‌ల్ స్టూడియోస్ సినిమాని నిర్మించింది. జూలై 6న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ‌వుతోంది.