పరిస్థితిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదనేది భారత్ అనుభవం చెబుతోంది!

Wednesday, May 12th, 2021, 09:00:02 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మొదటి దశ కంటే రెండవ దశ లో భారత్ చాలా నష్టాలు చూస్తోంది. భారీ గా ప్రాణ నష్టం సంభవిస్తుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితుల పై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్, అధ్యక్షునీ ప్రధాన వైద్య సలహాదారుడు ఆంటోనీ ఫౌచీ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ ను అంతమొందించే విషయం లో భారత్ తప్పుడు లెక్క వేయడం వలనే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని వ్యాఖ్యానించారు.

అయితే దేశంలో కరోనా వైరస్ బెడద లేదనుకొనివ్యవస్థలన్నింటిని తెరవడం వలనే ప్రస్తుతం ఈ పరిస్థితులు ఎదురు అవుతున్నాయి అని అన్నారు. అయితే పరిస్థితిని ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయకూడదనేది భారత్ అనుభవం చెబుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ప్రజారోగ్యం పరంగా అవసరం అయిన సన్నద్ధత గురించి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే ఇందుకోసం ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ పోవాలి అని తెలిపారు. అయితే ప్రపంచం లో ఎక్కడ ఎలాంటి వైరస్ ఉన్నా, అది అమెరికా కి ముప్పు తెస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే భారత్ లో భారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు, మరణాల పట్ల ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంటున్నాయి.