ఆ సినిమా నుండి తప్పుకున్న అను ఇమ్మానుయేల్ ?

Sunday, May 20th, 2018, 10:05:29 AM IST

క్రేజీ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ అను ఇమ్మానుయేల్ తాజాగా ఓ సినిమా నుండి తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది. తాజాగా ఆమె రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది కూడా. అయితే ఈ సినిమానుండి అను ఇమ్మానుయేల్ సడన్ గా తప్పుకుంది. ఈ విషయాన్నీ సదరు టీమ్ కూడా ధ్రువీకరించింది. అయితే అను డేట్స్ సమస్య వల్లే తప్పుకున్నట్టు యూనిట్ పేర్కొంది .. కానీ బయట మాత్రం మరోలా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అను తన పాత్ర నచ్చకనే బయటికి వచ్చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి కథ చెప్పినప్పుడు .. మరోలా చెప్పి .. షూటింగ్ సమయంలో తన పాత్రను మార్చడంతోనే అను తప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమా నుండి తానూ తప్పుకుంటున్నట్టు అను కూడా ప్రకటించడం విశేషం. ఇక ఈ మధ్య అను ఇమ్మానుయేల్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి .. పవన్ అజ్ఞాత వాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి సినిమాలు ఆమెను ఇబ్బంది పెట్టేసాయి.

  •  
  •  
  •  
  •  

Comments