పవన్ – త్రివిక్రమ్ కాంబో అని ఒప్పుకోలేదు!

Saturday, September 8th, 2018, 04:10:02 PM IST

క్యూట్ గా నవ్వుతోనే ఆకట్టుకునే బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ కూడా బేబీతో నటించడానికి ఇష్టపడుతున్నారు. అయితే అనుకున్నంత రేంజ్ లో మాత్రం అమ్మడు సక్సెస్ అందుకోవడం లేదు. అను చేసిన సినిమాలు చాలా వరకు నీరాశపరుస్తున్నాయి. అజ్ఞాతవాసి అనంతరం బన్నీతో చేసిన నా పేరు సూర్య కూడా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అను తన ఆశలన్నీ శైలజా రెడ్డి అల్లుడు పైనే పెట్టుకుంది.

నెక్స్ట్ వీక్ రానున్న ఈ సినిమా హిట్టవ్వాలని అను ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తోంది. ఇకపోతే తన కెరీర్ ను మారుస్తుందని అనుకున్న అజ్ఞాతవాసి గురించి అమ్మడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించక తప్పలేదు. ఆ సినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం నేను ముందు కథ విన్నాను. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ చూసి కాదు. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత లాంటి క్యారెక్టర్ అని తెలుసుకున్నా. అందుకే ఒప్పుకున్నా. అయినా అంత మంచి కాంబో అలాంటి రిజల్ట్ ఇస్తుందని ఎవరు ఊహిస్తారు అని అమ్మడు తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments