ఫోటో టాక్ : కుర్రాళ్ల గుండెలు జారిపోయే అందం..!

Sunday, October 29th, 2017, 05:27:51 PM IST

యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ లో సరికొత్త సంచలనం. అనుని వెతుక్కుంటూ క్రేజీ ఆఫర్లు ఆమె వద్దకు వస్తున్నాయి. అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఆక్సిజన్ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. టాలీవుడ్ లో టాప్ లీగ్ కు చేరుకోవాలనుంటే గ్లామర్ షో తప్పని సరి అనే ఫార్ములాని అను ఇమ్మాన్యుయేల్ బాగా ఫాలో అవుతున్నట్లు ఉంది.

ఈ మధ్యన ఎక్కడ కనిపించినా గ్లామర్ షో తో అదర గొడుతోంది. తాజాగా ఆక్సిజన్ ప్రచార కార్యక్రమంలో అను అందం చూస్తే అదుర్స్ అనాల్సిందే. త్వరలోనే అను తెలుగు యువత కలల రాణిగా మారిపోవడం ఖాయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అను ప్రస్తుతం పవన్ ‘అజ్ఞాతవాసి’ గా ప్రచారం జరుగుతున్న చిత్రంలోనూ, బన్నీ ‘ నాపేరు సూర్య చిత్రంలోనూ నటిస్తోంది.