నాలుగేళ్ల‌కే స్టార్ హీరోయిస్ స్టాట‌స్‌?

Wednesday, May 2nd, 2018, 09:28:28 PM IST

కెరీర్ ప్రారంభించి ఇప్ప‌టికి కేవ‌లం నాలుగేళ్లు మాత్ర‌మే. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత వేగంగా స్టార్ హీర‌యిన్ స్టాట‌స్ అందుకోవ‌డం వేరొక నాయిక‌కు అస్స‌లు కుద‌ర‌దేమో! న‌వ‌త‌రంలో జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతున్న అనూ ఇమ్మాన్యుయేల్‌పై ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ స‌హా కామ‌న్ జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌పోతే అనూ ఏ ఇత‌ర క‌థానాయిక‌తో పోల్చినా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్‌లో ఎంతో హాట్‌గా క‌నిపించ‌డంపైనా స‌ర్వ‌త్రా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం బ‌న్ని స‌ర‌స‌న `నా పేరు సూర్య‌`లో న‌టించిన అనూ… ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక లో ఊహాతీతంగా క‌నిపించి షాకిచ్చింది. ఆ రోజు దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌త‌ను త‌ల‌పించేలా అదిరిపోయే డ్రెస్‌లో క‌నిపించి మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అదిరిపోయే అందాల షో ఇస్తున్న‌ అను ఎమ్మాన్యువ‌ల్ ఇప్పుడు నా పేరు సూర్య వేడుక‌లో కూడా ఇదే చేసింది. ఈ సినిమా హిట్ట‌యితే ఇక త‌ను స్టార్ హీరోయిన్‌గా క‌ర్ఛీఫ్ వేసిన‌ట్టే. అటుపై రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ వంటి స్టార్ల‌తో నటించేందుకు లైన్ క్లియ‌రైన‌ట్టే.