ఫోటో టాక్ : సోకుల బాణాలు వదులుతోన్న పవన్ హీరోయిన్ !

Monday, October 23rd, 2017, 10:21:42 PM IST

మజ్ను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందం, అమాయకమైన చూపులు కలసిన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. కాగా అనుని క్రేజీ ఆఫర్లు పలకరిస్తున్నాయి. ఇప్పటికే ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది. మరో వైపు అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.

కాగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ఆడియో వేడుకలో అను ఇమ్మాన్యుయేల్ అందం చూస్తే ఫిదా కావాల్సిందే. ఎరుపు వర్ణపు డ్రెస్ లో మెరిసే అందంతో అను అదరగొట్టేసింది. అందాల ఆరబోతకైనా తాను సిద్ధం అని దర్శక నిర్మాతలకు అను ఈ విధంగా సిగ్నల్ ఇస్తోందన్న మాట.