అను మాయలో చిక్కుకున్న మెగా హీరోలు..లేటెస్ట్ గా ఎవరంటే..!

Tuesday, December 5th, 2017, 06:15:12 PM IST

అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ లో తాజా సంచలనం. ఈ మలయాళీ బ్యూటీ హవా నెమ్మదిగా టాలీవుడ్ మొత్తం విస్తరిస్తోంది.ఏదో మత్తు మందు జల్లినట్లుగా ఈ అమ్మడు మొదట మెగా హీరోలందరిని బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికే అను ఇమ్మాన్యుయేల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అజ్ఞాతవాసిలో, అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రాబోయే చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్.

అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ టాప్ చైర్ కు అతి చేరువలో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్న రకుల్ జోరు తగ్గడంతో అను కు బాగా కలసి వచ్చింది. మరికొన్ని బడా ఆఫర్లు కూడా అనుని వరిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ నిర్మాతలంతా అను కాల్ షీట్ల కోసం క్యూకట్టే పరిస్థితులు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments