అనూ ప‌క్కా ఈగోయిస్టు .. తెలుసా?

Thursday, September 6th, 2018, 03:18:22 PM IST

కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, మ‌జ్ను వంటి సినిమాలో బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్న అను ఇమ్మాన్యుయేల్ అటుపై అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి ఫ్లాప్‌లు అందుకుంది. ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించిన అజ్ఞాత‌వాసి, అల్లు అర్జున్ – `నా పేరు సూర్య‌` చిత్రాలు డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకోవ‌డంతో అనూ పై ఆ ప్ర‌భావం ప‌డింది. అయినా టాలీవుడ్‌లో రాణిస్తాన‌న్న ధీమా ఈ అమ్మ‌డిలో ఉంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో న‌టించింది. ఠ‌ఫ్ టాస్క్ మాష్ట‌ర్ మారుతి దిశానిర్ధేశ‌నంలో త‌న‌కో హిట్టొస్తుంద‌ని ఆశ‌గా ఉంది అనూ.

ఈగోయిస్టు అయిన త‌ల్లికి త‌గ్గ ఈగోయిస్టిక్‌ కూతురిగా న‌టించింది. మీరు రియ‌ల్ లైఫ్‌లోనూ ఈగోయిస్టేనా? అని ప్ర‌శ్నిస్తే అవున‌ని స‌మాధానం ఇచ్చి పెద్ద షాకిచ్చింది. రీల్ లైఫ్‌లోనే కాదు, రియ‌ల్ లైఫ్‌లోనూ నేను ఈగోయిస్టునే అని అంది. `శైల‌జారెడ్డి అల్లుడు` ప్ర‌మోష‌న్స్‌లో అనూ పైవిధంగా స‌మాధాన‌మిచ్చింది. ప్ర‌స్తుతం మీడియాలో ఇదో హాట్ టాపిక్‌. అనూపై ఆ మేర‌కు ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌లు హెడ్డింగులు ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఇక‌పోతే ఈగో అన్న మాటెత్తితో న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్లో సాయి ప‌ల్ల‌వి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. ఈగో స‌మ‌స్య‌ల‌తోనే సాయి ప‌ల్ల‌వి కెరీర్ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నా హీరోల‌తో చిక్కులొస్తున్నాయి. అయితే అనూ మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంద‌ని అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్యోధ‌న దుశ్శాస‌న పురుషాధిక్య ప్ర‌పంచంలో అమ్మాయిల‌ ఈగో ఎంత‌వ‌ర‌కూ గెలుస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments