షాక్ .. ఆ కేసులో సన్నీ లియోన్ ని అరెస్ట్ చేస్తారా ?

Friday, February 10th, 2017, 09:00:17 AM IST


బాలీవుడ్ పోర్న్ పాప కు ఇప్పుడు కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి ? అదేంటి .. ? ఏ విషయంలో !! అని షాక్ అవుతున్నారా .. ? ఇంటిదగ్గర ఖాళీగా ఉంటూ .. వెబ్ సైట్ లో మా లింక్స్ ని క్లిక్ చేస్తే చాలు సులభంగా లక్షలు సంపాదించవచ్చు అంటూ ప్రకటనలతో ఊదరగొట్టి .. 3, 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సోషల్ ట్రేడ్ కుంభకోణం ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తోంది? ఈ సోషల్ ట్రేడ్ ని స్థాపించిన అనుభవ మిట్టల్ ని పోలీసులు అరెస్ట్ చేసారు .. ఒక్క హైద్రాబాద్ లోనే 300 కోట్ల వరకు అతనికి మంగళం పాడించారు. ఈ కేసుకు .. పోర్న్ పాప సన్నీ కి ఏమిటి సంబంధం అంటారా ? అక్కడికే వస్తున్నా .. గత ఏడాది మార్చ్ లో అనుభవ మిట్టల్ ఇన్మర్ట్ అనే పోర్టల్ ని ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై చాలా హుషారుగా పాల్గొన్న సన్నీ అతని పుట్టి రోజున అతనితో కలిసి చిందులు వేసింది? ఆ ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో సన్నీకి అతనికి దగ్గరి సంబంధాలు ఉన్నాయనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట !! అది గనక ప్రూవ్ అయ్యిందంటే పోర్న్ పాపకు .. చుక్కలు తప్పవేమో !!