నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: అనుపమ

Monday, October 30th, 2017, 05:01:39 PM IST

‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ అభిమానులకు ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడి క్యూట్ నెస్ కుర్రకారును ఆకట్టుకుంటుండడంతో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అంతే కాకుండా నటించిన సినిమాలు కూడా మంచి విజయం సాదిస్తుండడంతో కొంత మంది దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా అనుపమ కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ లో బడా నిర్మాత చేతిలో కొంతమంది హీరోయిన్స్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొంతమంది సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో తాము కూడా లైంగిక వేధింపులు గురయ్యామని చెప్పారు. ఆ ట్యాగ్ ఇండియన్ సినీ సెలబ్రటీలు కూడా చాలా వాడేశారు. తాము కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని బాలీవుడ్ నటీమణులు సోషల్ మీడియాలో తెలిపారు.

అదే తరహాలో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని నటి అనుపమ పరమేశ్వరన్ కామెంట్ చేసింది. మీటూ అనే పదం ఆమె వరకు రావడంతో తనకు కూడా కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులని ఎదుర్కొన్నాను అని అయితే అప్పుడే వాటిని తిప్పి కొట్టాను అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మగవారికి కలిగే ఆనందం ఏమిటో నాకు తెలియదు. కానీ వారి పనుల వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బందిపడతారని అర్ధం చేసుకోవాలని చెబుతూ.. వారి ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయం గుర్తు చేసుకోవాలని అనుపమ ఆవేదనను వ్యక్తం చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments