పిక్‌టాక్‌ : ఇలానే మ‌డిగ‌ట్టుకు కూచుకుంటే?

Tuesday, June 12th, 2018, 10:47:53 AM IST

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అఖ్క‌ర్లేని పేరు ఇది. ప్రేమ‌మ్ చిత్రంతో తెలుగు కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది. నాటి నుంచి అనుప‌మ ఏం చేసినా అది కుర్ర‌కారులో హాట్ టాపిక్‌. అ..ఆ, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ వంటి చిత్రాల్లో అనుప‌మ న‌ట‌న‌కు యూత్ ఫిదా అయిపోయారు. అందానికి అందం, క్యూట్ అప్పియ‌రెన్స్ ఈ అమ్మ‌డికి అన్నిర‌కాలా ప్ల‌స్. అంతేకాదు.. ఈ భామ ఏ సినిమాలో న‌టిస్తే ఆ సినిమాకి త‌నే ప్ల‌స్‌. అయితే అది ఇంత‌కాలం సాగింది.. ఇక ముందు సాగుతుందా?

ఇన్‌స్టాగ్ర‌మ్‌, ట్విట్ట‌ర్ వంటి సామాజిక మాధ్య‌మాల్లోనూ అనుప‌మ ఎంతో స్పీడ్‌గా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌న‌మైన ఫోటోషూట్ల‌ను ఈ అమ్మ‌డు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తోంది. తాజాగా బులుగుజిలుగు డిజైన‌ర్ డ్రెస్‌లో అనుప‌మ ఇచ్చిన లుక్ కేక పుట్టించింది. ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తూ తెలుగుద‌నాన్ని ఆవిష్క‌రించింది. అన‌వ‌స‌ర‌మైన గ్లామ‌ర్ ఎలివేష‌న్‌తో చెల‌రేగిపోయే భామ‌ల న‌డుమ ఈ అమ్మ‌డు చంద‌మామ‌నే త‌ల‌పిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఎల్ల‌కాలం ఇదే చెల్లుతుందా? ఇలానే మ‌డిగ‌ట్టుకు కూచుంటే మునుముందు అవ‌కాశాలొస్తాయా? అన్న‌ది కాస్తంత చూడాల్సిందే. అనుప‌మ ప్ర‌స్తుతం ఓ రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. తేజ్ స‌ర‌స‌న `తేజ్ .. ఐ ల‌వ్ యు`, రామ్ స‌ర‌స‌న `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments