ద‌క్షిణాదిని బొంగ‌రంలా తిప్పేస్తోంది!

Wednesday, June 27th, 2018, 11:50:12 AM IST

దీపం ఉండ‌గానే బొంగ‌రం తిప్పేస్తోంది! ద‌క్షిణాది ఇండ‌స్ట్రీల్ని సుడి తిప్పేస్తూ త‌డాఖా చూపిస్తోంది. అస‌లింత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు.. అంటారా? అంత‌గా ప‌రిచ‌యం అఖ్క‌ర్లేదు. ప్రేమ‌మ్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించే. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేసిన ఈ భామ మ‌రో రెండు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు దూసుకొచ్చేస్తోంది. `తేజ్ ఐ ల‌వ్ యు` జూన్ 6న రిలీజ‌వుతోంది. రామ్ స‌ర‌స‌న న‌టించిన సినిమా రిలీజ్ బ‌రిలోకి వ‌చ్చేస్తోంది.

ఆస‌క్తిక‌రంగా తెలుగులో అన్ని సినిమాల్లో న‌టించేస్తున్న ఈ క్యూట్ బ్యూటీ మాతృప‌రిశ్ర‌మ మ‌ల‌యాళంలో చేసింది కేవ‌లం రెండే రెండు సినిమాలు. ఈలోగానే అటు త‌మిళంలోనూ సినిమాలు చేసేస్తోంది. అక్క‌డ ధ‌నుష్ స‌ర‌స‌న కోడి సినిమాలో న‌టించి తంబీలచెంత‌కు చేరువైంది. అలానే త‌మిళంలో ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసే ప‌నిలో ఉందిట‌. ఈలోగానే క‌న్న‌డంలోనూ తొలి అడుగు వేసేస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ ఓ సినిమాకి సంత‌కం చేసింద‌ని తెలుస్తోంది. దీంతో ద‌క్షిణాదిన నాలుగు కీల‌క భాష‌ల్లో అనుప‌మ ప్ర‌ద‌క్షిణం చేసేస్తోంది. నాలుగు చోట్లా నాలుగు రెళ్లు 8 సినిమాల‌కు సంత‌కాలు చేసినా ఈ అమ్మ‌డి అకౌంట్లోకి మినిమంగా 4కోట్లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఇలా దీపం ఉండ‌గానే బొంగ‌రం తిప్పేస్తోంది. క్యూట్‌గా న‌వ్వుతూ ఏట‌వాలుగా కోసేయ‌డం అంటే ఇదే సుమీ!