అనుప‌మ ప్రేమ‌లో ప‌డింది ఎవ‌రితో?

Monday, May 21st, 2018, 11:24:25 PM IST

ప్ర‌స్తుతం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇద్ద‌రు యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది. అందులో ఒక‌రు రామ్‌… ఇంకొక‌రు సాయిధ‌ర‌మ్ తేజ్‌. అయితే తాను ఆ ఇద్ద‌రిలో ఎవ‌రితో ల‌వ్‌లో ప‌డి ఉంటుంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఎలా? అయితే మీరంతా ఊహించ‌ని రీతిలో ఈ అమ్మ‌డు ఓ సీనియ‌ర్ హీరో ల‌వ్‌లో ప‌డింది. అత‌డెవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ లెజెండ్‌, ది గ్రేట్ మోహన్‌లాల్‌తో అనుప‌మ ఏనాడో ల‌వ్‌లో ప‌డింది.

ఆ సంగ‌తిని ఇదిగో సామాజిక మాధ్య‌మం ద్వారా అనుప‌మ ప్ర‌పోజ్ చేసిన తీరును బ‌ట్టి చెప్పేయొచ్చు. లాల్ కెరీర్ ఆద్యంతం ఓ పోస్ట‌ర్‌గా రూపొందించి.. అత‌డి కెరీర్‌ని ఎలివేట్ చేసే పోస్ట‌ర్‌ని అనుప‌మ ట్వీట్ చేసింది. ఫైనెస్ట్ యాక్ట‌ర్‌.. నిజ‌మైన స్ఫూర్తి.. అంటూ తెగ పొగిడేసింది. మొత్తానికి అనుప‌మ మోహ‌న్‌లాల్ అభిమాని అని తేలిపోయింది. రామ్ స‌ర‌స‌న `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రంలో న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, తాజాగా `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రంలో న‌టిస్తోంది. మ‌రో యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న తొలిప్రేమ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న `తేజ్‌… ఐ ల‌వ్ యు` చిత్రంలో న‌టిస్తోంది. ఇద్ద‌రు యువ‌హీరోల్లో ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డుతుందో? అని సందేహిస్తే, అనుప‌మ ఏంటి ఇలా చేసింది?

  •  
  •  
  •  
  •  

Comments