మరోసారి ఆ మెగా హీరోతో కలిసి నటించనున్న అనుపమ?

Friday, May 18th, 2018, 07:10:14 PM IST

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చిన్న హీరోల చిత్రాలలో నటిస్తూ మంచి పేరున్న హీరోయిన్ గా దూసుకుపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఆమె ప్రేమమ్, శతమానం భవతి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కాగా ఇటీవల ఆమె నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు భారీ పరాజయాలను చవి చూశాయి. కాగా ప్రస్తుతం అనుపమ కథల ఎంపికలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో సాయిధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్ యు’, అలానే రామ్ తో హలో గురు ప్రేమకోసమే చిత్రాలు వున్నాయి.

కాగా సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న తేజ్ ఐ లవ్ యు టీజర్ ఇటీవల విడుదలయి యూత్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. టీజర్ చూసినవాళ్లందరూ, తేజు, అనుపమాల జోడి చాలా బాగుందని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తేజు తదుపరి చిత్రంలో కూడా అనుపమనే తీసుకోవాలని నిర్ణయించినట్లు చెపుతున్నారు. ఆ చిత్రంలో కూడా పాత్రకు తగ్గట్లు అనుపమ సరిగ్గా సరిపోతుందని తేజు కూడా ఆ దర్శక నిర్మాతలతోపాటు అనుపమకు ఓటు వేసినట్లు తెలుస్తోంది…..

Comments